| తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా |
| పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా |
| అల్లి బిల్లి వెన్నపాల నురగలా |
| అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా |
| దేవ దేవుడే పంపగా |
| ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట |
| బ్రహ్మ కళ్ళలో కాంతులే |
| మా అమ్మలా మాకోసం మళ్లీ లాలి పాడేనంట |
| వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ |
| హారతిపల్లెం హాయిగ నవ్వే వదినమ్మా |
| వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ |
| నట్టింట్లోన నెలవంక ఇక నువ్వమ్మా |
| తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా |
| పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా |
| సాంప్రదాయనీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణీ సర్వాణీ |
| సాంప్రదాయనీ శుద్ధపద్మిని ప్రేమ శ్రావణీ సర్వాణీ |
| ఎద చప్పుడుకదిరే మెడలో తాలవనా |
| ప్రతి నిమిషం ఆయువునే పెంచెయినా |
| కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన |
| కలలన్నీ కాటుకనై చదివేనా |
| చిన్ని నవ్వు చాలే నంగనాచి కూనా |
| ముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా |
| ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోన |
| నిద్ర చెరిపేస్తావే అర్ధరాతిరైనా |
| ఏ రాకాసి రాశో నీది |
| ఏ ఘడియల్లొ పుట్టావె ఐనా… |
| వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువై బొమ్మ |
| నా ఊహల్లోన ఊరేగింది నువ్వమ్మో |
| వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ |
| నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా |
| ఏకాంతాలన్నీ ఏకాంతం లేక |
| ఏకరువే పెట్టాయే ఏకంగా |
| సంతోషాలన్నీ సెలవన్నది లేక |
| మనతోనే కొలువయ్యే మొత్తంగా |
| స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక |
| విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక |
| కష్టం నష్టం అనే సొంతవాళ్ళు రాక |
| కన్నీరొంటరాయే నిలువ నీడ లేక |
| ఎంతదృష్టం నాదేనంటూ |
| పగబట్టిందే నాపై జగమంతా… |
| నచ్చిందమ్మా నచ్చిందమ్మా నచ్చిందమ్మా జన్మా |
| నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా |
| మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదుటున కుంకమ బొమ్మ |
| ఓ వెయ్యేల్లాయుష్షంటూ దీవించిందమ్మా |
| తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా |
| పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా |
| అల్లి బిల్లి వెన్నపాల నురగలా |
| అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా |
| Tella tella vaare velugu rekala |
| Pacha pacha pachi matti bommala |
| Alli billi vennapala murugala |
| Achcha telugu inti puvvu kommala |
| Deva devude pampaga |
| Ila devathe maa inta aduge petenanta |
| Brahma kallalo kanthule |
| Ma amma la ma kosam malli lalli padenanta, |
| Vachindamma vachindamma edo ruthuvai bomma |
| Arathipallem haayiga navve vidudhamma |
| Vachindamma vachindamma Dikkina chukkala remma |
| Vantintlona nilavanka nuvvamma, |
| Tella tella vaare velugu rekala |
| Pacha pacha pachi matti bommala, |
| (Instrumental Music) |
| Sampradyani sudhapadmini prema sravani sarvani, |
| Sampradyani sudhapadmini prema |
| Sravani sarvani |
| Yedha cheppudu kadire medaalo talaavana |
| Prathi nimisham maa vithile pencheyana |
| Kumukapudu kudire nee kannulalona |
| Kannulanni kattukaalayi chadivena |
| Chinni navvu chale nanga nachipona |
| Mullokallu minge muthi murupu dana |
| Indradanasu dachi rendu kallalonna |
| Nidra cheripestavve ardha ratiri ayna, |
| Ee rakashi rasonidi ee gadiyam lo puttavve ayna |
| Vachindamma vachindamma edo ruthuvai bomma, |
| Naa oohallonna ooregindhi nuvvamma, |
| Vachindamma vachindamma ningina chukkala amma, |
| Naa brahmacharyam baaki cheripe sindhamma, |
| Eekanthalanni eekantham leka, |
| Eekaluve pettaye ekanga, |
| Santhoshalanni selavanadhi leka, |
| Manathone koluvayye mothanga, |
| Swagathalu leni lotu leka, |
| Viraham kanumerugu aye manatho egaleka, |
| Kastham nastham mane sontha valu raka, |
| Kannir ontaraaye nuvvai needa leka, |
| Inta adrustham nene antu, |
| Pagabathinde napai jamantha, |
| Nachindamma nachindamma nachindamma, |
| Neelo sagamai brathike bagyam nadamma, |
| Mechindhamma mechindhamma nodhutuna kunkuma bomma, |
| Teeyani gaayam chettu dhivinchindhamma, |
| Tella tella vaare velugu rekala, |
| Pacha pacha pachi matti bommala, |
| Alli billi vennapala murugala, |
| Achcha telugu inti puvvu kommala, |